Wednesday, January 22, 2025

కృష్ణ ధర్మ రక్షణ అధ్యక్షుడిపై కరాటే కళ్యాణి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళలను కించపరిస్తున్న కృష్ణ ధర్మ రక్షణ అధ్యక్షుడు కెల్లా దుర్గారావు పై చర్యలు తీసుకోవాలని ఆదిభట్ల కళా పీఠం అధ్యక్షురాలు, సినీ నటి కరాటే కల్యాణి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణ ధర్మ రక్షణ సంస్థ అధ్యక్షులు కెల్లా దుర్గారావు విజయవాడ వేదికగా ప్రజలను మోసం చేస్తూ ధర్మ రక్షణ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు. మహిళల సౌందర్యంపై కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ.. ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంలో త్వరలో కెల్లా దుర్గారావుపై మహిళ కమిషన్ కు పిర్యాదు చేయనున్నట్లు కరాటే కళ్యాణి వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News