Monday, December 23, 2024

ఆ సినిమాలో నటించడం లేదు: కరీనా కపూర్

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ కూడా నటించబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై కరీనా స్పందించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న ఆమె, ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో తాను నటిస్తోందో లేదో అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకూ తనతో స్పిరిట్ సినిమాకు సంబంధించి ఏ ఒక్కరు చర్చలు జరపలేదని, స్పిరిట్‌లో తాను భాగం కాబోవడం లేదని కరీనా కపూర్ స్పష్టం చేసింది. కరీనా కపూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘సౌత్ సినిమాల్లో నాకు తగ్గ పాత్రలు వస్తే కచ్చితంగా నటిస్తాను. అయితే, నా పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలి.

అప్పుడే నాకు ఆ పాత్ర దగ్గర అవుతుంది. ఇక ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో ఒకవేళ నాకు అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తాను. కానీ, ఇప్పటివరకూ ఆ సినిమాకి సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ప్రారంభం కానుంది. కాగా ‘స్పిరిట్’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని టాక్. అలాగే, సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ వైల్ ఎలిమెంట్స్ సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News