- Advertisement -
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కరీనా కపూర్ తాజాగా తన ఆహారపు అలవాట్ల గురించి మాట్లాడింది. అంతేకాదు, తనకు ఎంతో ఇష్టమైన ఒక వంటకం గురించి కూడా ఆమె వెల్లడించింది. తనకు కిచిడీ అంటే ఎంతో ఇష్టమని, పేర్కొంది. ఈ రుచికరమైన ఆహారం తన డైలీ రొటీన్ లో ఎంత ముఖ్యమైనదో చెప్పిన కరీనా, కిచిడీ తినకపోతే తనకు నిద్ర కూడా పట్టదని చెప్పింది. ఇంకా చెప్పాలంటే కిచిడీ లేకుండా నేను బతకలేను అని సరదాగా పేర్కొంది. బియ్యం, పప్పులతో చేసే కిచిడీ తేలికైన మసాలాలతో చేస్తారని, అందుకే అది చాలా రుచిగా ఉంటుందని, ఇందులో ఎన్నో పోషకవిలువలతో పాటూ సులభంగా జీర్ణం అవుతుందని కరీనా తెలిపింది. ఫిట్‌నెస్, వెల్‌నెస్‌కు ఫేమస్ అయిన కరీనా తను సరైన డైట్ మెయింటేన్ చేయడం వల్లే ఇంత ఆరోగ్యంగా ఉన్నానని, అందులో కిచిడీ కూడా చాలా కీలక పాత్ర పోషించిందని పేర్కొంది.
- Advertisement -