Sunday, January 19, 2025

సైఫ్‌పై కత్తితో దాడి..దుండగుడు ఏమీ దొంగిలించలేదు : కరీనా కపూర్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఒక ఆగంతకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు నటుడి సతీమణి కరీనా కపూర్ స్టేట్‌మెంట్‌ను కూడా రికార్డు చేసుకున్నారు. ఆ రోజు జరిగిన దాడి గురించి ఆమె పోలీసులకు తెలియజేశారు. దాడికి పాల్పడిన సమయంలో దుండగుడు ఎంతో ఆవేశంగా ఉన్నాడని చెప్పారు. సైఫ్‌పై ఆరుసార్లు కత్తితో దాడికి పాల్పడ్డాడని చెప్పారు. అయితే అతడు ఇంట్లో బయటనే ఉన్ననగలు ఏవీ దొంగిలించలేదని తెలిపారు.

పిల్లలను కాపాడే ప్రయత్నంలో సైఫ్ దుండగుడితో పోరాడేడని చెప్పారు. పిల్లలను పై ఫ్లోర్ లోకి పంపించేశామని కరీనా కపూర్ చెప్పినట్టు పోలీసులు వివరించారు. దాడి తర్వాత సోదరి నటి కరిష్మా కపూర్ వచ్చి తన ఇంటికి తీసుకెళ్లిందని కరీనా కపూర్ చెప్పినట్టు పోలీస్ అధికారులు వివరించారు. దాడికి పాల్పడిన దుండగుడిని పట్టుకోవడానికి 30 పోలీస్ బృందాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ సంఘటన తరువాత 48 గంటల పాటు దుండగుడు ఆ పరిసరాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News