Sunday, December 22, 2024

అత్యుత్తమ సంస్థలలో సీట్లు సాధించిన కారేపల్లి జూనియర్ కళాశాల విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

కారేపల్లి : కారేపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు అత్యుత్తమ సంస్థలలో సీట్లు వచ్చినట్లు కళాశాల ప్రిన్సిపల్ మీటకోటి సింహాచలం తెలిపారు. జూనియర్ కళాశాల వద్ద శుక్రవారం ఆయన మాట్లాడుతూ ధారావత్ చేతన్ కుమార్ (ఎన్‌ఐటి) తిరుచురాపల్లి, ధారావత్ అరవింద్ కుమార్ (ఎన్‌ఐటీ) వరంగల్ లో సీట్లు సాధించారని, అజ్మీరా శశికాంత్ (జేఈఈ అడ్వాన్సు ఫర్ కౌన్సిలింగ్) వెయిటింగ్‌లో ఉన్నారని తెలిపారు. తమ కళాశాలలో చదివిన విద్యార్థులు అత్యుత్తమ సంస్థ లలో సీట్లు సాధించడం తమకు చాలా ఆనందంగా ఉందని, తెలుపుతూ ఈ సందర్బంగా విద్యార్థులను ప్రధానాచార్యలు మీటకోటి సింహాచలం అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News