ఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోదుల కలల సాకారం చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సబ్‌కా ప్రయాస్-సబ్‌కా కర్తవ్య్ నినాదంతో ముందుకు వెళ్లాలన్నారు. అమృత్ మహోత్సవ్ వేళ మరింత్ వేగవంతంగా పని చేయాలన్నారు. అవినీతి నియంత్రణతో దేశం పురోభివృద్ధి వైపు పయనిస్తోందని, రేపు కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. భారత జవాన్ల శౌర్యానికి నిదర్శనంగా విజయ్ దివస్ వేడుకలు జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. జవాన్లు, వెంకయ్యనాయుడు దేశ ప్రజలందరికీ విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి నిరంతరం జరగాల్సిన ప్రక్రియ అని, స్థిరమైన జీవన విధానం చాలా అవసరమని స్పష్టం చేశారు. అటవీ సంపద, నీటి వనరుల ప్రాధాన్యం గుర్తించాలని, ప్రకృతి సంపదను అందరూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పర్యావరణ పరిరక్షణలో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా ఉందని కొనియాడారు. ప్రజాసేవలోనే జీవితం ధన్యమవుతుందని నమ్ముతున్నానన్నారు.