Monday, January 20, 2025

రాష్ట్రపతి నిలయంలో ఘనంగా కార్గిల్ విజయ్ దివస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కార్గిల్ విజయ్ దివస్ ని పురస్కరించుకుని రాష్ట్రపతి నిలయం లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా లెఫ్టినెంట్ జనరల్ జెఎస్ సిదానా (కమాండెంట్, ఎంసిఇఎంఇ), ఆయన సతీమణి మొహనిష్ సిదానా హాజరయ్యారు. హైదరాబాద్ నగరంలోని 15 కళాశాలలు, పాఠశాలల నుండి 3 వేల మంది విద్యార్ధులు, ఎన్‌సిసి కెడెట్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో దేశభక్తి, కార్గిల్ విజయ్ దివస్ అనే అంశాలతో రంగోలి పోటీలు నిర్వహించారు. దేశ నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవానుల సంస్మరణార్ధం థాంక్ యూ సందేశాలు చిత్రీకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిధి లెఫ్టినెంట్ జనరల్ జెఎస్ సిదానా 24 సంవత్సరాల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధం గురించి వివరించారు. అమరవీరులు కెప్టెన్ విక్రమ్ బాత్రా, ఇతరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ప్రాణాల గురించి పట్టించుకోని అమర సైనికుల త్యాగాల వల్లే దేశం ప్రశాంతంగా ఉంటోందని చిన్నారులకు చెప్పారు. రాష్ట్రపతి నిలయం మేనేజర్ డాక్టర్ కె, రజనీ ప్రియ రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్నా కార్యక్రమాల గురించి వివరించారు. పరిపాలన అధికారి అబ్దుల్ హనీఫ్ ఖాన్ కృతజ్ఞతలు తెలుపుతూ జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎంసిఇఎంఇ అధికారులు, రాష్ట్రపతి నిలయ శిబ్బంది, ఐటిబిపి, టిఎస్‌ఎస్‌పి శిబ్బంది పాల్గొన్నారని రాష్ట్రపతి నిలయ మేనేజర్ డాక్టర్ కె. రజనీ ప్రియ తెలిపారు.

Kargil-Vijay-Diwas1

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News