Wednesday, January 22, 2025

కాషాయమయమైన కరీంనగర్

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్: బిజెపి ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగులతో కరీంనగర్ పట్టణం నిండిపోయింది. “ప్రజా సంగ్రామ యాత్ర” ముగింపు సభకు ముఖ్యఅతిథిగా బిజెపి జాతీయ అధక్ష్యుడు జెపి నడ్డా రాక నేపథ్యంలో బిజెపి శ్రేణులు ఘనంగా ఏర్పాట్లు చేశాయి. కరీంనగర్ రహదారులన్నీ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్స్ వైపే… గురువారం 5వ విడత “ప్రజా సంగ్రామ యాత్ర” ముగియనున్ననేపథ్యంలో భారీ సభ ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు, బిజెపి నేతలు, కార్యకర్తలు భారీగా సభాస్థలికి చేరుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్న బండి సంజయ్ కి కరీంనగర్ లో ప్రజలు, బిజెపి నేతలు, కార్యకర్తలు అడుగడుగునా. ఘనస్వాగతం పలుకుతున్నారు. బండి సంజయ్ పై బిజెపి కార్యకర్తలు పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తలు ‘జెసిబి’ లతో బండి సంజయ్ పై పూల వర్షం కురిపించారు. కరీంనగర్ లోని కొత్తపల్లి మున్సిపాలిటీ జయశంకర్ కాలనీ వద్ద బండి సంజయ్ కి ఆడపడుచులు హారతులు పట్టి, నుదుట బొట్టు పెట్టి ఘన స్వాగతం పలికారు. “ట్రిపుల్ తలాక్” ను రద్దు చేసిన నేపథ్యంలో బిజెపి పై అభిమానంతో బండి సంజయ్ కి ముస్లిం సోదరీమణులు, మహిళలు రాఖీ కట్టి, కరీంనగర్ లోకి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News