Sunday, January 19, 2025

కరీంనగర్ ప్రజల రైలు ఆకాంక్షను నెరవేరుస్తా: వినోద్‌ కుమార్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ కు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెన్నికల్ ఎడ్యుకేషన్ తెస్తానని కరీంనగర్ బిఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ మీడిమా సమావేశంలో తెలిపారు. విద్యాసంస్థలకు 150 ఎకరాల భూమిని కూడా గతంలో గుర్తించామన్నారు. కరీంనగర్ కు ఉన్నత విద్యాసంస్థలు తేవాలనే తన లక్ష్యమని వినోద్ పేర్కొన్నారు. సింగపూర్ సంస్థతో ఒప్పదం కుదుర్చుకని తీసుకువస్తానని వివరించారు. కరీంనగర్ ప్రజల రైలు ఆకాంక్షను నెరవేరుస్తాని తెలిపారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు రైలుమార్గం వేసేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని ఆరోపించారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో కూడా రేవంత్ రెడ్డికి తెలియని వినోద్ విమర్శించారు. కరెంట్ సిరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయని వాపోయారు. ఇళ్లలో మళ్లీ ఇన్వర్టర్లు కొంటున్నారని తెలిపారు. మోడీ పదేళ్ల పాలనలో నిత్యావసరాల ధరలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. కరీంనగర్ కు బండి సంజయ్ కుమార్ ఏం చేశారో చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా.. విధ్వంసం కోరుకుంటారా అని ప్రశ్నించారు. కరీంనగర్ కేబుల్ బ్రిడ్జి కోసం ఆలోచించింది తానేనని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News