Monday, January 20, 2025

కరీంనగర్ సివిల్ ఆసుపత్రిలో ఎసిబి దాడులు..

- Advertisement -
- Advertisement -

Karimnagar Civil Hospital Assistant in ACB Net

కరీంనగర్: జిల్లా సివిల్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆసుపత్రిలో సీనియర్ అసస్టెంట్ గా పనిచేస్తన్న సురేందర్ 12వేల రూపాయలు లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ భద్రయ్య అధ్వర్యంలోని బృందం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఈ ఆసుపత్రిలో పని చేసే ఒక ఉద్యోగికి సంబందించిన మెడికల్ లీవ్ ల బిల్లు చెల్లింపుల విషయంలో సురేందర్ సదరు ఉద్యోగి నుంచి 12వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో మంగళవారం పక్కా ప్లాన్ ప్రకారం లంచం తీసుకుంటున్న సమయంలో ఎసిబి అధికారులు దాడి చేసి సురేందర్ ను అదుపులోకి తీసుకున్నారు.

Karimnagar Civil Hospital Assistant in ACB Net

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News