Monday, December 23, 2024

పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు: కలెక్టర్ ఆర్ వి కర్ణన్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: సోమవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ప్రాంగణం లో ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తమ పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రేపటి తరాలకు మొక్కల అవష్యకతను తెలిపడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. రేపటి తరాలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు మొక్కల అవసరం గురించి తెలపవలసిన అవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు.

మొక్కలు నాటడంతో పాటు వాటిని రక్షించుకొనే భాద్యత కూడా మనమే చేపట్టాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6 విడతలో ప్లాస్టిక్ బ్యాగులను, ప్లాస్టిక్ సంబందించిన వస్తువులను వాడకూడదని, క్లాత్ బ్యాగ్స్ వాడడం వాల్ల మన భూమిని, నీటిని కాపాడుకున్న వాళ్ళము అవుతామని కర్ణన్ చెప్పారు. ఇంతటి మంచి అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సభ్యులు గారెపల్లి సతీష్, పుటకం రవీంద్రనాథ్ ఠాగూర్, కలెక్టర్ సిసిలు నర్సింహారావు, రాంమోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News