Thursday, January 23, 2025

కరీంనగర్ ప్రజలు గర్వపడేలా అభివృద్ధి: గంగుల

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్: మా కరీంనగర్ కు రండి.. అభివృద్ధి చూడండి అని ప్రజలు గర్వంగా చాటిచెప్పేలా నగర రూపు రేఖలు మారుస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ పట్టణ అభివృద్ధిపై మున్సిపల్ అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలెక్టరేట్ లో సమీక్షా సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ద చూపుతుండటం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నగరంలో ఐల్యాండ్స్ అభివృద్ధి కి 10 కోట్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. గీతా భవన్, వన్ టౌన్, హోసింగ్ బోర్డు, మానేరు బ్రిడ్జ్ జంక్షన్ లలో నిర్మించే బ్యూటిఫికేషన్ తో నగరం మరింత అందంగా మారుతుందని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News