Tuesday, January 28, 2025

మహిళను ఈడ్చుకెళ్లిన లారీ… బండి సంజయ్ సహాయం

- Advertisement -
- Advertisement -

హుజరాబాద్ : చావు నోట్లో వరకు వెళ్లి సురక్షితంగా మహిళ ప్రాణాలతో బయటపడ్డ ఘ‌ట‌న‌ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.  ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ రోడ్డుపై కింద పడగా అటువైపు వెళుతున్న లారీ కింది భాగంలో చిక్కుకుంది. దివ్య శ్రీ జుట్టు లారీ కింది భాగంలో చిక్కుకొని పోవడంతో లారీ కొంత దూరం ఈడ్చుకుని వెళ్ళింది. మహిళ కేకలు వేయడంతో అప్రమత్తరమైన లారీ డ్రైవర్ లారీని పక్కగా ఆపాడు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అదే సమయంలో ములుగుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కాన్వాయ్ ని ఆపి హుటాహుటిన లారీ వద్దకు వెళ్లారు. లారీ కింద టైర్ పక్కన రాడ్డులో జుట్టు చిక్కుకుని రక్తమోడుతూ వెళాడుతున్న దివ్యశ్రీని చూసి భయపడొద్దని, దైర్యంగా ఉండాలని సూచించారు. అటువెళ్తున్న లారీలను ఆపి జాకీల సహాయంతో లారీని ఎత్తి.. దివ్య జుట్టును కట్ చేసి ఆమె ప్రాణాలను కాపాడారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. తల్లిని చూసి పిల్లలను బోరున విలపించారు. తీవ్రంగా గాయపడిన మహిళను కరీంనగర్ లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు కేంద్ర మంత్రి సంజయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News