Thursday, January 23, 2025

ఇద్దరు పిల్లలను కాపాడి ప్రాణాలొదిన తండ్రి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జలాశయంలో పడిన ఇద్దరు పిల్లలను కాపాడి తండ్రి మృతి చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్‌ఎండి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బంగారి విజయ్ కుమార్ అనే వ్యక్తి(47) కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అసిస్టెంట్ పే అండ్ అకౌంటెంట్‌లో సూపరింటెండెంట్‌గా ఉద్యోగం చేస్తున్నారు. సోమవారం సెలవు కావడంతో నత భార్య ప్రశాంతి, పిల్లలు సాయినిత్య, విక్రాంత్, అత్తమ్మ పుష్పలతతో కలిసి కారులో హుస్నాబాద్‌లోని పొట్లపల్లి శివాలయానికి వెళ్లారు. దేవుడిని దర్శనం చేసుకున్న అనంతరం ఎల్‌ఎండిని చూద్దామని జలాశయం పైకి వెళ్లారు.

హెడ్ రెగ్యులేటర్ వద్ద నుంచి కాకతీయ కాలువ వద్ద నీటిని విడుదల చేసే ప్రదేశం వద్ద సాయినిత్య సెల్పీలు తీసుకుంటుండగా నీటిలో పడిపోయారు. వెంటనే తండ్రి నీటిలో దూకి కూతురిని కాపాడాడు. అదే సమయంలో తండ్రి కోసం కుమారుడు కూడా నీటిలో దూకడంతో ఇద్దరిని ఒడ్డుకు చేర్చాడు. అదే సమయంలో తండ్రి నీటిలో మునిగిపోయాడు. కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న జాలరి శంకర్ తెప్పపై ఇద్దరు పిల్లలను బయటకు తీసుకొచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. ఎస్‌ఐ చేరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మృతుడు స్వస్థలం కరీంనగర్ జిల్లా సంతోష్ నగర్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News