Sunday, January 19, 2025

ఈత కోసం వెళ్లి తండ్రీకుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణం తీసిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుండ్లపల్లి గ్రామానికి చెందిన చాడ రంగారెడ్డి తన ఇద్దరు కుమారులతో కలిసి ఈత కొట్టడానికి లోయర్ మానేరు డ్యామ్‌కు చేరుకున్నారు. పెద్ద కుమారుడిని ఒడ్డుపై కూర్చొమని చెప్పి చిన్న కుమారుడు చైతన్యానందను(09) తీసుకొని నీటిలోకి తండ్రి వెళ్లిపోయాడు. నీళ్లలో కొంచెం దూరం వెళ్లిన లోతుగా ఎక్కువగా ఉండడంతో ఇద్దరు మునిగిపోయారు. స్థానిక జాలర్లు గమనించి వెంటనే వారిని నీళ్ల నుంచి బయటకు తీశారు. అప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో గుండ్లపల్లి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. సోదరుడు, తండ్రిని కోల్పోవడంతో పెద్ద కుమారుడు గుండెలు విలిసేలా రోధించాడు. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News