కరీంనగర్:తొమ్మిది సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పాలనలో కరీంనగర్ నగరం సురక్షితంగా ఉంటే. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గోతికి గుంట నక్కల్లా, రాబందుల్లా కాచుకొని చుస్తున్నారని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు మండి పడ్డారు. కరీంనగర్ లోని ఎస్ బి ఎస్ ఫంక్షన్ హాల్ లో శనివారం రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలీ పై ఫైర్ అయ్యారు.
గత వారం రోజులుగా నగరంలో 16 సె. మీ వర్షం ఓకే సారి కురిసినా నగరంలో ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు కలగలేదన్నారు. గతంలో 4 లేక 5 సె. మీ వర్షం కురిస్తేనే నగరంలో చాలా ప్రాంతాలు వరదలతో జలమయం అయ్యేవని ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవని తేల్చి చెప్పారు. ఎంత పెద్ద వర్షం కురిసిన ప్రజలు ఇబ్బంది పడకుండా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం మా ఇద్దరు నాయకులు మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ లు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి మా పాలకవర్గం ఆయాంలో పనులు చేయడమనేది గర్వకారణం అన్నారు.
గతంలో వర్షాలు కురిస్తే నగరంలోని చాలా ప్రాంతాల ప్రజలు వరద నీటితో ఇబ్బంది పడేవారని అన్నారు. ప్రస్తుతం ప్రజలు ఇబ్బంది పడకుండా తీసుకున్న కార్యక్రమాలు చాలా గొప్ప పలితాలను ఇచ్చాయని గర్వంగా చెబుతున్నట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మా పాలకవర్గం పనిచేస్తుంది కాబట్టి, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కొసమే వాడుతున్నాం కాబట్టి ఇంత గొప్పగా ఫలితాలు వచ్చాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నగరానికి సమకూర్చిన నిధుల వల్ల పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని తెలిపారు.
దాదాపుగా 2500 కోట్ల రూపాయల నిధులతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అందులో దాదాపు 80 శాతం పనులు పూర్తి చేయగా మిగిలిన 20 శాతం పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. ఎక్కడైనా గుంటల్లో నీరు నిలిచినా… డ్రైనేజీల్లో చిన్న సమస్య వస్తే…. దాన్ని భూతద్దంలో పెట్టి రాజకీయం చేయడమే పనిగా పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు.
అసలు అభివృద్ధి అంటే తెలియని నాయకులు బీజేపీ, కాంగ్రెస్ నాయకులని విమర్శించారు. 2014 కంటే ముందు కరీంనగర్ ఎలా ఉందో… 2023 సంవత్సరానికి నగరం ఏ విధంగా అభివృద్ధి చెందిందో పోల్చుకోవాలని హితవు పలికారు. 2014 కంటే ముందు కరీంనగర్ డ్రైనేజీ, రోడ్లు, లైటింగ్ వ్యవస్థ ఎలా ఉందో రెండు కళ్ళతో చూడాలన్నారు. కండ్లు పనిచేయకుంటే కంటి జబ్బులు ఉంటే సొంత డబ్బులతో పరీక్షలు చేయించాడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
కేబుల్ బ్రిడ్జ్ కార్యక్రమం ఇంత గొప్పగా కొనసాగితే… వేలాదిమంది ప్రజలు వెల్లి గొప్పగా నిర్మాణం చేశారని అభినందిస్తే…. ఏ రోజు వెల్లి చూసే దమ్ము లేని నాయకులు చిన్న అప్రోచ్ రోడ్డు పగుల్లు వస్తే పోయి రాజకీయం చేయడం చాలా విడ్డూరంగా ఉందన్నారు. చేసిన అభివృద్ధి ని చూసి ఓర్వలేక చిన్న సమస్యను పెద్దగా చూపించి రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. మీ ప్రభుత్వాలు పాలిస్తున్న ప్రాంతాల్లో కనీసం బ్రిడ్జ్ లు ప్రారంభించక ముందే కూలిపోతుంటే ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
బ్రిడ్జ్ లు నిర్మాణం చేయడం ఒక తెలంగాణ రాష్ట్రం లోనే లేదని మీ పాలిత రాష్ట్రాల్లో కూడ నిర్మాణం చేస్తున్నారని అన్నారు. గుజరాత్ రాష్ట్రంలో వంతెన కూలి 135 మంది జలసమాది అయితే కనీసం పట్టించుకున్న దిక్కులేదని నిప్పులు చెరిగారు. మోడి సోంత రాష్ట్రంలో నే బ్రిడ్జ్ కూలితే దానికి సమాదానం ఏదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిస్తున్న ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో కూడ వంతనే ప్రారంభం కాక ముందే పడి పోయింది మరీ దాని ఏం సమాదానం చెబుతారని ప్రశ్నించారు. మాట్లాడే ముందు సిగ్గు ఉండాలని నిప్పులు చెరిగారు.
కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కొత్త రోడ్డు కాబట్టి కుంగినందుకు దాన్ని పెద్దగా చేసి ప్రజలను తప్పు ద్రోవ పట్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నగరంలో ఏమి దొరకక పోవడంతో దాన్ని సాకుగా చేస్కోని రాజకీయం చేస్తున్నారని అన్నారు. కుక్కకు బొక్క దొరికినట్లుగా కేబుల్ బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు అంశం దొరికింది కాబట్టి దాన్ని పట్టుకొని కంకడం జరుగుతుందని అన్నారు.
వచ్చే మూడు మాసాల్లో ఎన్నికలు వస్తున్నయ్… ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూస్కుందామని సవాల్ విసిరారు. కనీసం మీ పార్టీలకు డిపాజిట్లు కూడ రావని…. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకోవాలన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ కార్పోరేటర్లు గంట కళ్యాణీ, గుగ్గిల్ల జయశ్రీ, కంసాల శ్రీనివాస్, వాల రమణ రావు, తోట రాములు, ఎదుల్ల రాజశేఖర్, బండారి వేణు, నాంపల్లి శ్రీనివాస్ , బీఆర్‌ఎస్ నాయకులు పిట్టల శ్రీనివాస్, నక్క కృష్ణ, తుల బాలయ్య, కోల సంపత్ రెడ్డి, గుగ్గిల్ల శ్రీనివాస్,ఖరీం, ఉయ్యాల శ్రీనివాస్, కుంభం అనిల్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.