Friday, November 15, 2024

కరీంనగర్ కవులకు, కళాకారులు పుట్టిన నేల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : ఒకప్పుడు కరీంనగర్ అంటే వెనుకబడిన జిల్లా అని, కల్లోలిత జిల్లా అని పేర్కొనేవారని, కానీ నేడు కరీంనగర్ కవుల కళాకారుల జిల్లాగా పేరు పొందడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

బుధవారం స్థానిక ఉజ్వల పార్కు ఎదురుగా సాహితీ సం స్థల సమాఖ్య సాహితీ గౌతమికి 5 గుంటల స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నేడు కరీంనగర్‌కవుల కళాకారుల జిల్లాగా పేరు పొందడమే కాకుండా అన్ని రంగాల్లో కరీంనగర్ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందన్నారు.

శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కానీ, కేబుల్ బ్రిడ్జి కానీ, మానేరు రివర్ ఫ్రంట్ కానీ కరీంనగర్‌కు కొత్త అందాన్ని, కొత్త శోభను తెచ్చిపెడతాయని ఇదంతా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్లనే సాధ్య మైందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, నాయకత్వ బలం వల్లనే ఈ అభివృద్ధిని మనం నేడు చూడగలుగుతున్నా మని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రికి కవులన్నా, కళాకారులన్న ఎంతో గౌరవం అని అందుకే కవులకు, కళాకారులకు ఉచితమైన స్థానాన్ని కల్పించాలని సంకల్పం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్, నగర మేయర్ వై సునీ ల్‌రావు, కార్పొరేటర్లు, సాహితీ గౌతమి సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు నంది శ్రీనివాస్, కొత్త అనిల్, కవులు, సాహితీ వేత్తలు, తదిత రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News