Monday, December 23, 2024

ప్రసన్నాంజనేయ దేవాలయాన్ని సందర్శించిన మేయర్

- Advertisement -
- Advertisement -

 

కరీంనగర్ అర్బన్: కరీంనగర్ పట్టణంలోని 34వ డివిజన్ పరిధిలోని గోదాంగడ్డ గుట్టపై ఉన్న అంజనాద్రి ప్రసన్నాంజనేయస్వామి దేవాలయాన్ని బుధవారం నగర మేయర్ యాదగిరి సునీల్‌రావు సందర్శించారు. దేవాలయం చుట్టూ భక్తిశ్రద్ధలతో ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మేయర్‌కు వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం అందించారు.ఈ సందర్భంగా మేయర్ మాటాలడుతూ…. భక్తులు ఆరాధ్య దైవంగా కొలిచే శ్రీరాముడి కోటి నామాలు రాసిన వారికి సకల శుభాలు సిద్దిస్తాయన్నారు.

ఆలయానికి వచ్చే భక్తులకు రామ కోటి ప్రతలు అందుబాటులో ఉంటాయని రామకోటి రాయాల్సిన భక్తులు రామ కోటి రాసి స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. రామ కోటి ప్రతులను ముద్రించి సమర్పించిన కుంభం అనిల్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ షుకూర్ అంజూమ్ బర్కత్ ఆలీ, కార్పొరేటర్ సల్ల శారద రవీందర్, టీఆర్‌ఎస్ నాయకులు దూలం సంపత్, జక్కుల నాగరాజు, సాయి, విద్యాసాగర్, నరేందర్, రవివర్మ, కుంభం సంజయ్, హమీద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News