Friday, December 20, 2024

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ అరెస్టు..

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు బొడిగె శోభను కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 2న చేపట్టిన జాగరణ దీక్ష సందర్భంగా కరీంనగర్ టూటౌన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఏ10గా ఉన్న బొడిగె శోభను కొద్దిసేపటి క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు సాయంత్రం కరీంనగర్ బైపాస్ రోడ్డులోని శోభ ఇంటికి వెళ్లిన పోలీసు బలగాలు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించాయి. వైద్య పరీక్షలు చేయించడంతో పాటు రిమాండ్ సీడీ తయారు చేసి ఆమెను కరీంనగర్ కోర్టులో హాజరు పరిచేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్టు సమాచారం.

Karimnagar Police arrest Bodiga Shobha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News