Saturday, November 9, 2024

మెడికల్ హబ్ గా మారనున్న కరీంనగర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: ప్రభుత్వం మెడికల్ కళాశాల రాకతో కరీంనగర్ జిల్లా హైదరాబాద్,వరంగల్ తర్వాత మెడికల్ హబ్ గా మారనున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.శనివారం కొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంత్రి సందర్శించారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న పనులను పరిశీలించారు. కళాశాలలో స్టాఫ్ క్వార్టర్స్, హాస్టల్, ల్యాబ్, క్లాస్ రూములను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదలు సైతం వైద్య విద్యను అభ్యసించేందుకే తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నగరంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు కరీంనగర్ వాసుల చిరకాల వాంఛ అని,కరీంనగర్లో ఇప్పటికే రెండు ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఉన్నాయని అప్పటికి నిరుపేదలు లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుకోలేరని,నిరుపేదలు సైతం వైద్య విద్యను అభ్యసించేందుకే సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు.

ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు కూడా ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ వచ్చిందని కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో ఆలస్యం చేసిందని దీంతో చాలామంది చాలా రకాలుగా ప్రచారం చేశారన్నారు తెలంగాణ ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.సీఎం కేసీఆర్ మంత్రి హరీష్ రావులు చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకువచ్చారన్నారు.

ఈ ఆగస్టు నుండి 100 మంది విద్యార్థులతో కరీంనగర్ మెడికల్ కాలేజీలో తరగతులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.ప్రస్తుతం తాత్కాలిక భవనంలోనే క్లాసులు నిర్వహిస్తామని,తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టామన్నారు.వేగవంతంగా పనులు చేపట్టి శాశ్వత భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.

ప్రభుత్వ మెడికల్ కాలేజీ రాకతో కరీంనగర్ హైదరాబాద్ వరంగల్ తర్వాత మెడికల్ హబ్ గా మారనుందని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, కొత్తపెళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జడ్పీ సీఈవో ప్రియాంక, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితా దేవి, వైద్య కళాశాల ప్రిన్సిపల్, ఆర్ అండ్ బి అధికారులు, వైద్యులు ,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News