Monday, December 23, 2024

కెటిఆర్ ను కలిసిన కరీంనగర్ టిఆర్ఎస్ అధ్యక్షుడు రామకృష్ణ

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ నూతన అధ్యక్షుడు జి వి రామకృష్ణ రావు తో కలిసి టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మంత్రి గంగుల కమలాకర్

Karimnagar TRS President meet with KTR

హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా జివి రామకృష్ణారావును నియమించిన విషయం విధితమే.  పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ను శుక్రవారం ఉదయం మంత్రి గంగుల కమలాకర్, నూతన అధ్యక్షుడు రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెటిఆర్ నూతన అధ్యక్షునికి అభినందనలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమర్థుడైన మంత్రి గంగుల కమలాకర్ రూపంలో అండగా ఉన్నారని, సుశిక్షితులైన కార్యకర్తలతో కరీంనగర్ గులాబీ సేన పటిష్టంగా ఉందని రాబోయే రోజుల్లో పార్టీ కోసం మరింత తీవ్రంగా శ్రమించి అప్రతిహత విజయాల్ని అందుకోవాలని కెటిఆర్ సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి గంగుల మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కరీంనగర్ కు అండగా ఉన్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వంలో కరీంనగర్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ అకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో కరీంనగర్ నూతన అధ్యక్షులు జివి రామకృష్ణ రావు, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఒడితల సతీష్, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News