Friday, December 27, 2024

కరిష్మా కపూర్ మళ్లీ పెళ్లి చేసుకుంటుందా?

- Advertisement -
- Advertisement -

ముంబై: హిందీ సినీ నటి కరిష్మా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఏఎంఏ’(యాస్క్ మీ ఎనిథింగ్) సెషన్‌లో అనేకమంది అడిగే ప్రశ్నలకు జవాబులిచ్చింది. ఆమె తన అభిమానులతో ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా ఇంటరాక్ట్ అవుతూనే ఉంటుంది. ఫోటో షేరింగ్ కూడా చేస్తుంటుంది. తన సెషన్‌లో ఆమె అనేక ప్రశ్నలకు జవాబులిస్తున్నప్పుడు ఓ అభిమాని ‘మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?’ అని ప్రశ్నించాడు. దానికామె ‘డిపెండ్స్’ (బహుశా) అని మర్మంగా చెప్పింది. అంటే పరిస్థితులను బట్టి ఉంటుంది అన్న అర్థంలో చెప్పింది. కరిష్మా కపూర్ ఇదివరలో బిజినెస్ మ్యాన్ సంజయ్ కపూర్‌ను 2003లో వివాహమాడింది. వారికి సమైరా అనే కూతురు, కియాన్ అనే కొడుకు ఉన్నారు. 2014లో వారు పరస్పర అవగాహనతో వేరుపడ్డారు. తర్వాత 2016లో విడాకులు కూడా తీసుకున్నారు. పిల్లలిద్దరూ కరిష్మాతోనే ముంబైలో ఉంటున్నారు. ప్రస్తుతం కరిష్మా ఓటిటి కోసం క్రైమ్ థ్రిల్లర్ ‘బ్రౌన్’ చేస్తోంది. గతంలో ఆమె ‘దిల్‌తో పాగల్ హై’, ‘రాజా హిందుస్థానీ’, ‘జుడ్వా’ అనే హిట్ సినిమాల్లో నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News