Friday, December 20, 2024

కర్కాటక రాశివారికి ఈ ఏడాది డబ్బే డబ్బు!

- Advertisement -
- Advertisement -

ఆదాయం : 14 వ్యయం : 02
రాజ : 06 అవమానం : 06

పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదముల యందు పుట్టిన వారు “హీ, హూ, హే, హో, డా, డీ, డూ, డే, డో” అను అక్షరములు తమ పేరునకు మొదట గలవారు కర్కాటకరాశికి చెందినవారు.

కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూలకాలం. మీరు ఈ సంత్సరంలో చేపట్టబడే ఆర్థిక పరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు. విద్యా, గృహ సంబంధమైన, విదేశీ సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి. మీ యొక్క శతృవర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారతారు. భాగస్వాముల వ్యాపారంలో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాలలో ఉన్నవారు, స్నేహితులు, అత్తింటివారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్మకూడదో బేరీజు వేసుకోవడం కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టమంలో ఉన్న శని భగవానుడు. ఈ రాశి వారికి అష్టమంలో శని నడుస్తున్నందు వలన అఘోరపాశుపత ెమం అలాగే ఎనిమిది (8) శనివారాలు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. అదే విధంగా నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి.

సాంకేతిక పరమైన విషయాలలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి పిహెచ్‌డి (PhD) చేసే వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చును. గురువు దశమ లాభ స్థానాలలో సం చారం. శని అష్టమ స్థాన సంచారం, రాహుకేతు తృతీయ భాగ్య స్థానాలలో సంచారం, కుజ గ్రహ సంచారం. గురు, శుక్ర మౌడ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఐ.ఏ.ఎస్., ఐ.పిఎస్. గ్రూపు సర్వీసులకు ఎంపిక అవుతారు. విద్యా రంగంలో ఘనవిజయం సాధిస్తారు. పోటీపరీక్షలలో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. ఆహారధాన్యాల వ్యాపారాలు, హోట ల్ వ్యాపారులు, నీళ్ళ వ్యాపారులు, విద్యాసంస్థల యజమానులు, డాక్టర్లు, గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు.

ధర్మవిరుద్ధమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. ఎప్పు డో కొనుగోలు చేసిన స్థిరాస్థికి విలువ పెరుగుతుంది. మీ అంతరాత్మకు విరుద్ధంగా ఒకరికి సన్నిహితం అవుతారు. జీవితంలో నూతన వ్య క్తులు ప్రవేశిస్తారు, నిష్ర్కమిస్తారు. మీరు మాత్రం రాగభావ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తారు.
విదేశాలలో చదువుకునే వారికి అనుకూల కాలం. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓ ర్పు, సహనం చాలా అవసరం. భార్యాభర్తల మ ధ్య విభేదాలు సృష్టించి తమాషా చూసే వారు, తెగతెంపులు చేసేవారు ఉన్నప్పటికీ దైవానుగ్రహం వలన కొంత వరకు ఇబ్బందులు నుండి బయటపడతారు. ఈ రాశికి సంబంధించిన కొ ద్దిమంది విషయంలో వైవాహిక స్పర్థలు అధికమవుతాయి, విడాకులు వంటివి సంభవించవ చ్చు, విడాకుల అనంతరం సంతానం విషయం లో మనోవేదన ఏర్పడుతుంది.కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు తగిన మూల్యం చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది, పద్ధతులు మార్చుకుంటారు. వీసా, పాస్‌పోర్టు లభిస్తాయి.

నూతన విద్యను అభ్యసించాలని ఉత్సాహపడే వారికీ విదేశాలలో చదువుకుని, ఉద్యోగం చేసి అప్పులు తీర్చి కుటుంబ స్థాయిని పెంచాలని ఆరాటపడే వారికి ఇది అనుకూల కాలం. గ్రీన్ కార్డు లభించే ప్రయత్నాలు దాదాపు చివరిదశకు చేరుకుంటాయి. విద్యార్థినీవిద్యార్థులు విశేషంగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తా రు. గురు గ్రహ అనుగ్రహం వలన ఆర్థిక పరమై న అంచనాలు మీరు ఊహించని దానికన్నా రెట్టింపు అవుతాయి. ఎంత అదుపులో ఉంచాలనుకున్నా, కొన్ని సందర్భాలలో అనారోగ్యం కొ రకు కొంత ఖర్చుపెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోదర, సహోదరీ వర్గానికి ఆర్థికసహాయం చేసి జీవిత భాగస్వామికి విరోధం అవుతారు. మీరు ఎంతగానో వేచి చూస్తున్న భూముల విలు వ అమాంతం పెరిగే అవకాశాలు గోచరిస్తున్నా యి. లాయర్లకు, మతాధికారులకు, టీచర్లకు వృత్తి పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. పాడి పరిశ్రమలో వచ్చే లాభాలు సంతృప్తికరంగా ఉంటుంది.

మీరు పెట్టే ప్రతీ పైసాకి అంత కు అంత లాభాల పంట పడుతుంది. విద్యా, సాంసృ్కతిక విషయాల్లో కొన్ని మార్పులు వస్తా యి. వాలెంటరీ రిటైర్‌మెంట్లు వద్దు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. స్టేషనరీ వ్యాపారస్ధులకు అలంకార సామాగ్రి విక్రేతలకు, గృహ నిర్మాణ సంబంధ సామాగ్రి విక్రేతలకు అనుకూల వాతావరణం సూచిస్తున్నాయి. అదే విధంగా గృహ సంబంధ, అలంకార సంబంధ, బంగారం, నగల వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. బ్యాంక్, చిట్స్ వ్యవహారాల పట్ల జాగ్రత్త వహించండి. మీ ఖాతాలలో మీకు తెలియకుండానే కొంత మొత్తం మాయం అవుతాయి. చిట్టీలు, చిట్స్‌ఫండ్స్‌లలో కూడా మీకు తెలియకుండానే మోసపోయే అవకాశాలు ఉన్నాయి. రహస్యంగా పెట్టిన కొన్ని పెట్టుబడులు వలన కొన్ని విషయ వ్యవహారాలలో న్యాయపరమైన చిక్కులలో పడతారు.

ఈ సంవత్సరం వివాహం కాని వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఆకస్మికంగా వివాహం కుదురుతుంది. కాకుంటే జాతకపరిశీలన చేసుకుని వివాహం చేసుకోండి. వి వాహం కుదరడంలో కాని, ఒడిదుడుకుల విషయంలో కాని ఎటువంటి లోటు-పాట్లు జరిగినా, జరగడానికి కారణం బుధ, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం. పునర్వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం లేని వారికి సంతానప్రాప్తి. గురు దృష్ఠి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News