Thursday, January 23, 2025

శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి.. గురుబలమే శ్రీరామరక్ష

- Advertisement -
- Advertisement -

కర్కాటకం…

–వీరికి ఆదాయం –11 వ్యయం–8, రాజపూజ్యం–5 అవమానం–4.
ఈ రాశి వారిపై అష్టమశని ప్రభావం అధికంగా ఉంటుంది. కేవలం గురుబలమే వీరికి శ్రీరామరక్ష అని చెప్పవచ్చు. అలాగే, రాహు, కేతువులు కూడా సమపాళ్లలో ఫలితాలు ఇస్తారు. కొన్ని విషయాలలో భావోద్వేగాలకు లోనవుతారు. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనంతో ఉపశమనం కలుగుతుంది. బంధువులు, కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. అష్టమశని ఫలితంగా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉండాలి. అలాగే, ప్రతి కార్యక్రమంలోనూ మరింత జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకున్నా నష్టపోయే అవకాశాలున్నాయి. గురుబలం వల్ల ఆదాయానికి లోటు లేకుండా జీవితాన్ని నడిపిస్తారు.

అలాగే, శుభకార్యాలకు ఖర్చులు చేయాల్సి వస్తుంది. చర, స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలలో చురుకుదనం కనిపిస్తుంది. వ్యాపారస్తులు కొత్త సంస్థల ఏర్పాటులో ఆచితూచి వ్యవహరించాలి. బ్యాంకు రుణాలు వంటి వాటి వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగులకు మరింత పనిభారంతో పాటు, పైస్థాయి వారి అజమాయిషీ పెరుగుతుంది. పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా ముందుకు సాగితే అనుకున్న విజయాలు సాధించవచ్చు.

రాజకీయనాయకులకు మొదట్లో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా ద్వితీయార్థంలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళాకారులు ఈ సంవత్సరం కొంతభిన్నమైన వైఖరితో అందరినీ ఆకట్టుకుంటారు. రైతులకు మొదటి పంట కంటే రెండవ పంట లాభసాటిగా ఉంటుంది. అనుకున్న పెట్టుబడుల్లో కొంత జాప్యం తప్పదు. విద్యార్థులకు విద్యాకారకుడైన గురుడు అనుకూలస్థితి వీరికి ఉపకరిస్తుంది. న్యాయ, వైద్య, పరిశోధనారంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.చైత్రం, వైశాఖం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలిస్తాయి. మిగతావి సాధారణంగా ఉండవచ్చు. వీరు శనికి తైలాభిషేకం, జపాలు చేయించాలి. అలాగే, ఆంజనేయ స్వామిని విరివిగా పూజించడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News