- Advertisement -
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా భాధ్యతలు స్వీకరించిన ఆర్.వి కర్నన్ ను నగరపాలక సంస్థ కమీషనర్ వల్లూరు క్రాంతి కలెక్టరేట్ కార్యాలయంలో కలిశారు. కలెక్టర్ ఆర్.వి కర్నన్ కు పూల మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపి ఆహ్వానం పలికారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న శశాంకను జనరల్ అడ్మినిస్టేషన్ డిపార్డ్ మెంట్ బదిలీ చేశారు. ఖమ్మం కలెక్టర్ గా పని చేస్తున్న కర్ణన్ కు కరీంనగర్ లో పోస్టింగ్ ఇస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం ఉదయం కర్ణన్ కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
- Advertisement -