Monday, January 20, 2025

కర్నాటకలో బిఎఫ్-7 వేరియంట్‌కు ఉచిత చికిత్స

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కరోనావైరస్‌కు చెందిన బిఎఫ్-7 వేరియంట్‌కు కర్నాటక ప్రభుత్వం ఉచిత చికిత్స అందించనున్నట్లు ప్రకటించింది. కర్నాటక రెవెన్యూ మంత్రి ఆర్. అశోకా ఈ విషయాన్ని ప్రకటించారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్, మంగళూరులోని వెన్‌లాక్ హాస్పిటల్ లో ఈ ఉచిత చికిత్స అందించబోతున్నామని ఆయన ప్రకటించారు. బిఎఫ్-7 వేరియంట్ అనేది ఒమిక్రాన్ సబ్‌వేరియంట్. ఇప్పుడు ఈ వేరియంటే చైనాలో విస్తృతంగా వ్యాపించి ఉంది. దాంతో భారత అధికారులు ముందుగానే ఎదుర్కొనే చర్యలు మొదలెట్టారు.

న్యూ ఇయర్ వేడుకలప్పుడు కొవిడ్-19 మార్గదర్శకాలను పాటించాలని మంత్రి అశోకా తెలిపారు. మార్గదర్శకాల ప్రకారం బారులు, పబ్‌లు, రెస్టారెంట్లు సహా పబ్లిక్ ప్రదేశాలలో మాస్క్ తప్పనిసరి ధరించాలి. కొవిడ్-19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిని మాత్రమే ఆ ప్రదేశాలలోకి అనుమతిస్తారు. జనం ఎక్కువ పోగవ్వకుండా చూడాలని ఎస్టాబ్లిష్‌మెంట్లకు ఉత్తర్వులు జారీచేశారు. సినిమా థియేటర్లలో కూడా మాస్క్‌లు ధరించడం తప్పనిసరి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News