Monday, November 25, 2024

కావేరీ నీరు ఇచ్చే పరిస్థితి లేదు.. అధికారిక సంస్థకు కర్నాటక మొర

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : తమిళనాడుకు కావేరీ నదీజలాల విడుదలపై కర్నాటక కావేరీ జలనిర్వహణ అధికారికసంస్థ ( సిడబ్లుఎంఎ)ను ఆశ్రయించింది. జలాల విడుదల ఆదేశాలపై పునఃసమీక్ష జరపాలని కోరుతూ ఈ సంస్థకు పిటిషన్ దాఖలు చేసినట్లు కర్నాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ గురువారం తెలిపారు. తమిళనాడుకు కనీసం 3000 క్యూసెక్కుల నీరు కూడా విడుదల చేయలేమని తమ అశక్తతను తెలిపినట్లు వివరించారు.

కావేరీ సంస్థకు తమ పిటిషన్ వెళ్లిందని, అయితే ఎప్పటికీ ఇది పరిశీలనకు వస్తుందనేది తెలియదని తెలిపారు. తమిళనాడుకు కావేరీ నీటి విడుదల అంశం క్రమేపీ రాజకీయ వివాదానికిదారితీస్తోంది. బంద్‌లు ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఈ దశలో కర్నాటక ప్రభుత్వం స్పందించింది. కావేరీ నదిపై మెకెదతు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణపనులపై ముందుకు వెళ్లుతామని, ఇది ఆగదని ఉప ముఖ్యమంత్రి వివరించారు. సరైన వర్షాలు పడకపోవడంతో ఈసారి కావేరీ రిజర్వాయర్లలో నీటి కొతర ఉందని డికె చెప్పారు. రాష్ట్ర జలవనరుల మంత్రిత్వశాఖను కూడా డికె నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రెండు మూడు రోజులుగా పడుతున్న వర్షాలతో పరిస్థితి మెరుగుపడుతుందని ఆశిస్తున్నట్లు, ఇప్పుడున్న పంటలను ప్రభుత్వం అన్ని విధాలుగా కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News