Monday, December 23, 2024

కర్ణాటకలో కమలానికి ఎదురీత: మాజీ సిఎం జగదీష్ షెట్టార్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటకలో ఈసారి కమలనాధులకు ఎదురీత తప్పదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని మాజీ సిఎం జగదీష్ షెట్టార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, సోనియా, తదితర నేతల ప్రచారం తమ పార్టీకి లాభిస్తుందని, తమ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. బీజేపీ టికెట్ ఆశించి భంగపడిన షెట్టార్ కాషాయ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. హుబ్లీ దార్వాడ్ సెంట్రల్ నియోజక వర్గం నుంచి షెట్టార్ పోటీ చేస్తున్నారు. ప్రముఖ లింగాయత్ నేతలు షెట్టార్, లక్ష్మణ్ సవదలు బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరడం, వీరశైవ లింగాయత్ సంఘం కాంగ్రెస్‌కు మద్దతు పలకడం బీజేపికి షాక్ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News