బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో పోలింగ్ జరుగుతోంది. 11.00 గంటల వరకు పోలింగ్ శాతం 20.99 నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఉడిపిలో అత్యధికంగా 30.26 శాతం పోలింగ్ నమోదు కాగా చమరాజనగర్‌లో 16.77 పోలింగ్ శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. గంగావతి సెంట్రల్ అసెంబ్లీ పరిధిలోని 159, 160 బూతులలో బిజెపి కార్యకర్తలు కర్నాటక రాజ్య ప్రగతి పక్ష పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. బెల్లరీ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ పరదిలో బిజెపి- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గొడవలు జరగడంతో ఉమేష్ యాదవ్ అనే వ్యక్తి తలకు బలమైన గాయం తగిలింది. బిజెపి డబ్బులు పంచి అసెంబ్లీ ఎన్నికలలో గెలివాలని చూస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఆరోపణలు చేశారు. నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడం లేదని విమర్శించారు. అభివృద్ధికి గురించి మోడీ ఎందుకు ప్రస్తవించడంలేదని అడిగారు.
Also Read: సన్‌రైజర్స్‌కు ప్లేఆఫ్ కష్టమేనా..!