Wednesday, January 22, 2025

కావేరీ విడుదలపై కర్నాటక బంద్ సంపూర్ణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాల విడుదలకు వ్యతిరేకంగా కన్నడ ఒక్కూట ఇచ్చిన కర్నాటక బంద్ శుక్రవారం సంపూర్ణంగా జరుగుతోంది. బెంగళూరుతోపాటు ఇతర దక్షిణ జిల్లాలో బంద్ కారణంగా జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

బెంగళూరు అర్బన్, మాండ్య, మైసూరు, చామరాజనగర, రామనగర, హసన్ జిల్లాలలో 144 సెక్షన్ అమలులో ఉంది. ఆయా జిల్లాలలో స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
కన్నడ సంఘాలు, రైతు సంఘాల సమాఖ్య అయిన కన్నడ ఒక్కూట గత మంగళవారం బెంగళూరు బంద్‌ను నిర్వహించింది.

మాండ్య వంటి కావేరీ నది పరీవాహక జిల్లాలలో దుఖానాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయి. ప్రైవేట్ వాహనాలు సైతం రోడ్లపైకి రాలేదు. నిరసకారులకు భయపడి ప్రభుత్వం కూడా ఆర్టీసీ సర్వీసులను నిలిపివేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో బంద్ పాక్షికంగా జరుగుతోంది.

చిత్రదుర్గలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ చిత్రాలను నిరసకారులు దగ్ధం చేశారు. బంద్‌కు కన్నడ చిత్రపరిశ్రమ మద్దతు ప్రకటించింది. బంద్‌కు కర్నాటక చిత్ర ప్దదర్శకుల సంఘం మద్దతు ప్రకటించడంతో సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో ప్రదర్శరలు నిలిపివేశారు.బెంగళూరులో పనిచేసే చాలా ఐటి కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని కోరాయి. చిక్‌పేట్, బలేపేట్ వంటి ముఖ్యమైన మార్కె ట్ ప్రాంతాలు వెలవెలబోతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News