Friday, January 10, 2025

ఫొటోషూట్ కు అనుమతించలేదని యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: చిన్న చిన్న కారణాలకే యువత ఆత్మహత్య చేసుకుంటుంది. ఫొటోషూట్‌కు తల్లిదండ్రులు అంగీకరించడకపోవడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ యువతి ఫొటో గ్రఫీ పూర్తి చేసి అనంతరం బిబిఎ చదువుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా ఓ మాల్‌లో ఫొటోషూట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఫొటోషూట్ చేస్తానని తల్లిదండ్రులకు ఆమె చెప్పడంతో వారు నిరాకరించారు. మనస్థాపం చెందిన యువతి ఇంట్లో ఓ గదిలో ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజు గదిలో కూతురు విగతజీవిగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీంటిపర్యంతమయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గది నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించకపోవడంతో ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News