Sunday, January 19, 2025

టిఫిన్ పెట్టలేదని దారుణానికి ఒడిగట్టిన టీనేజీ యువకుడు!

- Advertisement -
- Advertisement -

బెంగళూరులో దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన తల్లి ఉదయమే బ్రేక్ ఫాస్ట్ వండకపోవడంతో కోపం వచ్చిన పదిహేడేళ్ల కొడుకు ఇనుప రాడ్ తో కొట్టి తల్లిని చంపేశాడు. ఆర్కే పురానికి చెందిన 17 ఏళ్ల కుర్రాడు కాలేజీలో చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లేందుకు తయారవుతూ తన తల్లిని టిఫిన్ పెట్టమన్నాడు. టిఫిన్ చేయలేదని అతని తల్లి (40) చెప్పడంతో ఆమెతో వాదనకు దిగాడు. కొడుకు కోపం పట్టలేక పక్కనే ఉన్న ఓ ఇనుపరాడ్ తో తల్లి తలపై కొట్టాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. దాంతో ఆ కుర్రాడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. అయితే తన తల్లి స్పృహ తప్పిందేమోనని భావించాననీ, ఆమెను లేపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందనీ ఆ యువకుడు చెప్పుకొచ్చాడు. ఆ యువకుడి తండ్రి రైతు. ఉదయమే ఆయన పొలానికి వెళ్లినట్లు తెలిసింది.

కాగా తల్లీకొడుకులు తరచూ గొడవ పడటం తమకు తెలుసుననీ, కానీ కొడుకు ఇంతకు తెగిస్తాడని అనుకోలేదనీ చుట్టుపక్కలవారు పోలీసులకు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News