Sunday, January 19, 2025

ఆర్‌టిసి బస్సులో మహిళపై కండక్టర్ లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: బస్సులో ప్రయాణం చేస్తుండగా ఒంటరిగా ఉన్న మహిళపై బస్సు కండక్టర్ లైంగిక దాడి పాల్పడిన సంఘటన కర్నాటకలోని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలో మహిళలకు ఆర్‌టిసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించింది. ఆధార్ కార్డు చూపిస్తే చాలు జీరో టికెట్‌ను మహిళలకు కండక్టర్లు అందజేస్తారు. ఓ మహిళ రాత్రి సమయంలో బెంగళూరు నుంచి రాయచూర్ వెళ్తున్న బస్సు ఎక్కింది. కొంచెం దూరం వెళ్లిన తరువాత బస్సులో ప్రయాణికులు దిగపోవడంతో మహిళ ఒంటరిగా బస్సులో ఉంది. ఇదే అదునుగా భావించిన కండక్టర్ లైట్లు ఆఫ్ చేసి ఆమె వద్దకు చేరుకున్నాడు. ఉచిత టిక్కెట్ కావాలంటే తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు.

ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె ప్రైవేటు పార్ట్‌పై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తెరుకునే లోపు ఆమెపై కండక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. రాయచూర్‌లో బస్సు దిగిన వెంటనే ఆర్‌టిసి అధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది. కండక్టర్‌ను ఆర్‌టిసి అధికారులు నిలదీయంతో అతడు నీళ్లు నమిలాడు. తాను తప్పు చేయలేదని బుకాయించాడు. దీంతో రాయచూర్ బస్టాండ్‌లో మహిళా ప్రయాణికులు ధర్నాకు దిగారు. మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. బస్సుల్లో తమకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు వాపోతున్నారు. కండక్టర్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News