Sunday, January 19, 2025

గాలి పంపును స్నేహితుడి మర్మాంగంలోకి చొప్పించి… మృతి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: సరదా కోసం స్నేహితుడి మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్ చొప్పించి, అనంతరం ఎయిర్ ఆన్ చేయడంతో యువకుడు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. సంపెగహళ్లి ప్రాంతంలో మురళి అనే వ్యక్తి వాషింగ్ సెంటర్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. యోగేశ్(24) తన స్నేహితుడు మురళీ వద్దకు వెళ్లి బైక్‌ను సర్వీసు చేయాలని అడిగాడు. ఇద్దరు సరదా కోసం ఎయిర్ బ్లోయర్ నాజిల్‌లో కొంచెం సేపు ఆడుకున్నారు. మురళి ఎయిర్ బ్లోయర్‌తో యోగేశ్ ముఖంపై గాలి కొట్టాడు. అతడు తప్పించుకొని ఇటు ఆటు వెళ్తుండగా యోగేశ్‌ను పట్టుకొని మర్మాంగంలోకి నాజిల్‌ను చొప్పించాడు. వెంటనే ఆన్ చేయడంతో పొట్ట ఉబ్బిపోయి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. గాలి ఒత్తిడితో లోపల అవయవాలు దెబ్బతినడంతో ఆపరేషన్ చేయాలని వైద్యులు తెలిపారు. చికిత్స చేస్తుండగా అతడి ప్రాణాల్లో గాల్లో కలిసిపోయాయి. యోగేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News