Wednesday, January 22, 2025

404 పరుగులతో యువీ రికార్డు బద్దలుకొట్టిన కర్నాటక బ్యాట్స్‌మెన్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక యువ బ్యాట్స్‌మెన్ ప్రఖర్ చతుర్వేది రికార్డు సృష్టించాడు. కర్నాటక-ముంబయి మధ్య అండర్ 19 కూచ్ బెహార్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్‌లో 404 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. 24 ఏళ్ల క్రితం యువరాజ్ సింగ్(358) రికార్డును బద్దలు కొట్టాడు. 2011-12లో మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్ విజయ్ జోల్ 451(నాటౌట్) పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా చతుర్వేది రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో కర్నాటక ఎనిమిది వికెట్లు కోల్పోయి 890 పరుగులు చేయడంతో టైగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కర్నాటక టైటిల్‌ను సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ముంబయి జట్టు 380 పరుగులు చేసి ఆలౌటైంది. చతుర్వేది 638 బంతుల్లో 46 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 404 పరుగులు చేశాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కించుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News