Sunday, January 19, 2025

లవర్‌ను కత్తితో పది సార్లు పొడిచి….

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరులో 25 ఏళ్ల వ్యక్తి తన లవర్‌ను కత్తితో పది సార్లు పొడవడంతో ఆమె చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. దినాకర్ అనే యువకుడు, లీలా అనే యువతిని గత ఐదు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. దినాకర్ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. కులాలు వేరు కావడంతో ప్రేమ వివాహానికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో యువతిపై దినాకర్ కక్ష పెంచుకున్నాడు. ప్రేమించి తన మోసం చేసిందనే కోపంతో దినాకర్ ఆమెను కత్తితో పది సార్లు పొడిచాడు. దీంతో యువతి ఘటనా స్థలంలోనే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు బెంగళూరు ఈస్ట్ డిసిపి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News