Monday, January 20, 2025

ప్రార్థనల కోసం లౌడ్‌స్పీకర్లు ఎందుకు.. బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక మాజీ మంత్రి, బిజెపి ఎమ్మెల్యే కెఎస్ ఈశ్వరప్ప కొత్త వివాదానికి తెరతీశారు. లౌడ్‌స్పీకర్లలో ప్లే చేస్తేనే అజాన్ ప్రార్థనలను అల్లా వింటారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మంగళూరు సమీపంలోని కావూరులోగల శాంతినగర్‌లో ఆదివారం బిజెపి విజయ సంకల్ప యాత్రలో ఈశ్వరప్ప ప్రససంగిస్తూ, అక్కడకు వెళ్లినా ఇదే తలనొప్పి అంటూ వ్యాఖ్యానించారు. లౌడ్‌స్పీకర్ ద్వారా వినేవారిని బధిరులు అని అంటారు.. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఇదివరకే ఉత్తర్వులు జారీచేసింది.. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుంది..ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు అంటూ ఈశ్వరప్ప వ్యాఖ్యానించారు.

అన్ని మతాలను సమానంగా గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారని, లౌడ్‌స్పీకర్ల ద్వారా మాత్రమే అల్లా ప్రార్థనలు వింటారా అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. మా ఆలయాలలో కూడా మేము ప్రార్థనలు చేస్తాము.. శ్లోకాలను పఠిస్తాము.. భజనలు చేస్తాము. నిజానికి వారికన్నా మా భక్తుల సంఖ్యే ఎక్కువ.. దేవుడిని వారి కన్నా మేమే ఎక్కువ పూజిస్తాము. ప్రపంచంలో మతాన్ని కాపడేది కేవలం భారతదేశం మాత్రమే అంటూ ఆయన ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News