Monday, December 23, 2024

కర్నాటక కేబినెట్‌లో మరో 24 మంది మంత్రులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రెండు రోజుల సుదీర్ఘ చర్చల అనంతరం కర్నాటకలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రివర్గంలో చేరబోయే కొత్త మంత్రుల పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. శనివారం ఉదయం మరో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌ల మధ్యగంటలసేపు మంతనాలు అనంతరం ఎఐసిసి ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్, రణదీప్ సుర్జేవాలాలతో వారు జరిపిన చర్చల అనంతరం ఈ పేర్లు ఖరారయినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

కులాలు, ప్రాంతాల వారీగా సమతుల్యత కలిగిన ఈ జాబితాకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఆమోదముద్ర వేశారు. ఈ నెల 20న కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రిగా డికె శివకుమార్‌లతో పాటుగా 8 మంది కేజినెట్ మంత్రులు కూడా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. కర్నాటక కేబినెట్‌లో మొత్తం 34 మంది మంత్రులు ఉండవచ్చు. కాగా కొత్తగా మంత్రులుగా చేరనున్న వారిలో లింగాయత్, వొక్కలిగ కులాలకు చెందిన నలుగురేసి మంత్రులు, ఎస్‌సిలు, ఎస్‌లు ఇద్దరేసి, ముస్లిం, బ్రాహ్మణ వర్గాలకు చెందిన వారుఒక్కొక్కరు, ఓ మహిళ ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News