Monday, December 23, 2024

కర్నాటక మంత్రివర్గ విస్తరణ: 24 కొత్త మంత్రులు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసిన వారం రోజుల తర్వాత క్యాబినెట్ విస్తరణ జరిగింది. శనివారం 11.45 గంటలకు రాజ్‌భవన్‌లో 24 మంది ఎంఎల్‌ఏలు కొత్తగా మంత్రి వర్గంలో చేరారు. శనివారం ప్రమాణస్వీకారం చేసిన ఎంఎల్‌ఏలలో దినేశ్ గుండు రావు, కృష్ణ బైరె గౌడ, ఈశ్వర్ ఖంద్రే, రహీం ఖాన్, సంతోష్ లాడ్, కె.ఎన్.రాజన్న, కె. వెంకటేశ, హెచ్.సి. మహాదేవప్ప, బైరథి సురేశ్, శివరాజ్ తంగడి, ఆర్.బి. తిమ్‌పుర్, బి.నాగేంద్ర, లక్ష్మీ హెబ్బాల్కర్, మధు బంగారప్ప, డి.సుధాకర్, చెలువరాయ స్వామి, మంకుల్ వైద్య, ఎంసి. సుధాకర్ ఉన్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన 24 మందిలో ఒకరు మహిళా మంత్రి, తొమ్మిది మంది తొలిసారి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వారు ఉన్నారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్ వద్ద భద్రత పెంచారు. పెద్ద ఎత్తును ప్రజలు చేరారు. మంత్రివర్గంలోకి చేరిన వారిలో ఆరుగురు ఒక్కలిగలు, ఎనిమిది మంది లింగాలయత్ నాయకులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News