Thursday, January 23, 2025

మంత్రుల ఎంపికకు ఢిల్లీకి డికె , సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: తదుపరి కేబినెట్‌లో మంత్రులుగా ఎవరెవ్వరిని తీసుకోవాలనే అంశంపై సంప్రదింపులకు సిద్ధరామయ్య, డికెలు శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. పార్టీ హైకమాండ్‌తో చర్చించి మంత్రుల పేర్లను ఖరారు చేస్తారు. వివిధ కుల వర్గ సమీకరణలను ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవల్సి ఉంటుంది. మంత్రుల ఎంపిక , శాఖల కేటాయింపుల ప్రక్రియ అంతా కూడా అధిష్టానం సమ్మతి మీదనే జరుగుతుంది. కర్నాటకలోని మతాలు, ప్రత్యేకించి కుల ఆధిపత్య రాజకీయాలను బేరీజు వేసుకుని మంత్రివర్గ ఏర్పాటుకు దిగడమే నియుక్త ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముందున్న తొలి పరీక్షగా మారింది. పైగా పాతతరం, కొత్త తరం ఎమ్మెల్యేలకు, దళితులు, ముస్లింలకు కూడా తగు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

కర్నాటకలో కేబినెట్‌లోకి 34 మంది వరకూ మంత్రులను తీసుకునే ఏర్పాటు ఉంది. మంత్రి పదవులను, కీలక శాఖలను ఆశిస్తున్న వారి జాబితా పెద్దగానే ఉంది. ప్రమాణస్వీకారానికి ఖర్గే, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు నిర్థారణ అయింది. ఇక తమిళనాడు సిఎం స్టాలిన్, బెంగాల్ సిఎం మమత బెనర్జీ, బీహార్ సిఎం నితీశ్‌కుమార్, ఎన్‌సిపి చీఫ్ శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా , జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్, ఇతరులకు ఆహ్వానాలు అందాయి. అయితే ఇంతకు ముందటి కార్యక్రమాల వల్ల తాను బెంగళూరుకు వెళ్లడం లేదని బెంగాల్ సిఎం మమత ఖర్గేకు తెలిపారు. ఇక ఆహ్వానితులలో ఎందరు కార్యక్రమానికి వస్తారనేది వెల్లడికాలేదు. ప్రమాణస్వీకారం కాగానే కేబినెట్ తొలి భేటీ జరుగుతుంది.

ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ఐదు అంశాల హామీ పత్రం అమలు సంబంధిత సంతకాలు కొత్త కేబినెట్ తొలి సంతకాలు అవుతాయని భావిస్తున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే కంఠీరవ స్టేడియంలో ఇప్పటికే తగు విధంగా ఏర్పాట్లు చేపట్టారు. ఎండతీవ్రతను పరిగణనలోకి తీసుకుని సరైన విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు. మొత్తం మూడు వేదికల ఏర్పాట్లు, ప్రమాణస్వీకారాన్ని ప్రజలు ఇబ్బంది లేకుండా వీక్షించేందుకు ఎల్‌ఇడి స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News