Monday, December 23, 2024

హైదరాబాద్‌లో కర్నాటక క్యాంపు రాజకీయాలు….. హోటల్స్ బుకింగ్

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ 120, బిజెపి 73, జెడిఎస్ 25, ఇతరులు 6 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు.  కర్నాటక రాజకీయ తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. గెలిచిన ఎంఎల్‌ఎలతో హైదరాబాద్‌లో క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీల నేతలు ప్రముఖ హోటల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. బెంగళూరుతో పాటు హైదరాబాద్‌లోనూ హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు. తాజ్‌కృష్ణ, పార్క్‌హయత్, నోవాటెల్ సహా పలు హోటల్స్‌ను బుక్ చేసుకుంటున్నారు. కర్నాటక రాజకీయ పార్టీల నేతలు బల్క్‌గా బుకింగ్ చేసుకుంటున్నారు. తాజ్‌కృష్ణలో 18, పార్క్‌హయత్‌లో 20, నోవాటెల్‌లో 20 రూములు బుకింగ్ చేసుకున్నారు. గెలిచిన అభ్యర్థులను హోటళ్లకు తరలించే అవకాశం ఉంది.

Also Read:  హంగ్ వస్తే కింగ్ ఎవరు?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News