Thursday, January 23, 2025

కర్నాటక టకటక..ఇంకా తేలని సిఎం అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్నాటకలో తదుపరి ముఖ్యమంత్రి ఎవ్వరనేది సోమవారం కూడా తేలలేదు. సీనియర్ నేత సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్ మధ్య సిఎం పీఠం కోసం పోటీ తీవ్రస్థాయిలో ఉంది. కాగా సోమవారం అనూహ్య పరిణామంగా డికె శివకుమార్ తమ ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సిద్ధరామయ్య మకాం వేసి ఉన్నారు. ఈ దశలోనే డికె కూడా ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్లుతారని, అక్కడ పార్టీ పెద్దలతో తన అభిప్రాయాన్ని తెలియచేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత ఆయన తాను ఢిల్లీకి వెళ్లడం లేదని తెలిపారు. దీనితో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తీరు సాఫీగా సజావుగా సాగే పరిస్థితి లేదని స్పష్టం అయింది.

మరో వైపు బెంగళూరులో ఆదివారం నాటి సిఎల్‌పిలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్న పార్టీ కేంద్ర పరిశీలకులు సుశీల్‌కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. వెంటనే వారు పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. పరిస్థితిని తెలిపారు. ఈ పరిశీలకుల వెంబడి పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, కర్నాటక పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి రణదీప్ సూర్జేవాలా కూడా ఉన్నారు. ఈ ఆరుగురు నేతలు సుదీర్ఘంగా మాట్లాడుకున్నారు. సిద్ధరామయ్య, డికెలలో సిఎం అభ్యర్థిత్వం పట్ల ఎమ్మెల్యేల మొగ్గు ఎటువైపు ఉందనేది పరిశీలకులైన పార్టీ సీనియర్ నేతలు తెలిపినట్లు వెల్లడైంది.

సిఎం ఎవరు కావాలి? ప్రభుత్వ ఏర్పాటులో పద్ధతుల గురించి విశ్లేషించుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే డికెతో ఫోన్‌లో, సిద్ధరామయ్యతో నేరుగానూ మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News