Saturday, November 23, 2024

25న యడ్యూరప్ప రాజీనామా!

- Advertisement -
- Advertisement -

Karnataka CM BS Yediyurappa to Resign

అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తాం : యడ్డీ
26న రెండేళ్ల ఉత్సవాలు రద్దుతో సంకేతాలు

బెంగళూరు : ఈనెల 25న కర్నాటక సిఎం పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయనున్నట్లు సమాచారం. యడ్డీ స్థానంలో పార్టీలోని సీనియర్ నాయకుడిని అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా తనపై వస్తున్న వార్తలపై యడ్యూరప్ప గురువారంనాడు స్పందించారు. అధిష్టానం ఆదేశాలు శిరసావహిస్తానని ప్రకటించారు. ఈ వారాంతం తర్వాత తాను ముఖ్యమంత్రి పదవిలో ఉండే అవకాశం లేదని సూచనప్రాయంగా వెల్లడించారు. సిఎం పదవికి ఎవరిని సూచించినా తాను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. ఈ నెల 26 నాటికి కర్నాటకలో తన ప్రభుత్వానికి రెండేళ్లు నిండుతాయని, అయితే ఆ రోజు ఎలాంటి ఉత్సవాలు నిర్వహించడం లేదన్నారు.

బిజెపిని తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్నదే తన లక్షమని, కార్యకర్తలు, మఠాధిపతులు సహకరించాలని కోరారు. అయితే తన రాజీనామాను ఇప్పటి వరకు ఎవరూ కోరలేదని, ఒకవేళ హైకమాండ్ ఆదేశిస్తే రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేస్తానని యడ్యూరప్ప అన్నారు. 78 ఏళ్ల యడియూరప్ప ముఖ్యమంత్రి పదవి చేపట్టి రెండేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా జూలై 26వ తేదీన ఓ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకోగా అవన్నీ రద్దయ్యాయి. అధిష్టానం ఆదేశాల మేరకు యడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త ముఖ్యమంత్రిగా మురుగేష్ నిరానీ, బసవరాజ్ ఎస్.బ్మొ, ఆర్.అశోక్, సి.ఎన్.అశ్వత్థ నారాయణ్, జగదీష్ షెట్టర్(మాజీ సీఎం), ఎమ్మెల్యే అరవింద్ బెల్లాద్ నియమితులవుతారని వార్తలు వినిపిస్తున్నాయి.

Karnataka CM BS Yediyurappa to Resign

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News