Wednesday, April 2, 2025

ఎన్నడూ తప్పు చేయలేదు: సిద్ధ రామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మైసూరు నగరాభివృద్ధి సంస్థ(ముడా) కుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన గవర్నర్ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించారు. ‘‘ నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం. ఇప్పటి వరకూ ఎలాంటి తప్పు చేయలేదు. భవిస్యత్తులోనూ చేయబోను. నా ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకే బిజెపి, జెడిఎస్ కలిసి కుట్ర పన్నాయి’’ అన్నారు.

‘‘నా రాజకీయ జీవితంలో ఒక్క మరక లేదు. నా పై విచారణ చేయమంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశం రాజకీయ ప్రేరేపితమైనది. వాటిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటా’’ అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. తనను నాశనం చేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీనే నాశనం చేయొచ్చన్న భ్రమలో బిజెపి ఉందని అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలో మాదిరిగా కర్ణాటకలో కూడా ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ‘ముడా’ విచారణ విషయంలో రాజీనామా చేయల్సిన అవసరం లేదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News