మక్తల్ : మండల కేంద్రంలో ఎమ్మెల్యే అభ్యర్థి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్ షోలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పాల్గొన్నారు. స్ధానిక కన్యకా పరమేశ్వరి దేవాల యం నుంచి అంబేద్కర్ కూడలి వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దరామయ్య మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని దుష్ప్రచారం జరుగుతోందని, దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతి సొమ్ముతో రాజ్యాన్ని ఏలుతోందని దాన్ని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కర్నాటక రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కావడం లేదని దుష్ప్రచారాన్ని మానుకోవాలని,
తాము ఇచ్చిన ఐదు గ్యారంటీలో 4 పథకాలను అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేశామని, మరొక పథకాన్ని జనవరి నుండి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముఖ్యకారణం సోనియా గాంధీ అని, రాష్ట్రం ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పుకోలేని దుస్థితిలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారని విమర్శించారు. అనేక వాగ్దానాలు చేసి కనీ సం పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు అంది ంచలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని అన్నారు. కర్నాటకలో ప్రెటో ల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో, ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని అన్నారు.