Sunday, January 19, 2025

ప్రధాని మోడీ పచ్చి అబద్దాల కోరు..

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పనైపోయిందని కామారెడ్డి కాంగ్రెస్ బిసి డిక్లరేషన్ సభలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి నాలుగైదు సీట్లు వస్తే అవే చాలా ఎక్కువని ఆయన ఎద్దేవా చేశారు. మోడీ వంద సార్లు వచ్చి ప్రచారం చేసినా బిజెపి అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో కోసం మోడీ కర్నాటకకు 48 సార్లు వచ్చారని సిద్ధరామయ్య తెలిపారు.

మోడీ ఎక్కడ ప్రచారం చేశారో అక్కడే కాంగ్రెస్ ఎక్కువ మెజారిటీ వచ్చిందని పేర్కొన్నారు. మోడీని నమ్ముకున్న కర్నాటక బిజెపి నేతలు ఆ తర్వాత తలపట్టుకున్నారన్నారని తెలిపారు. ప్రధాని మోడీ పచ్చి అబద్దాల కోరు.. మోడీ వంటి అబద్దాల కోరు ప్రధానిని ఇంతవరకూ చూడలేదని సిద్ధరామయ్య మండిపడ్డారు. మోడీ ప్రధాని అయ్యాక దేశం ఆర్థికంగా దివాలా తీస్తోందని ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News