Friday, November 1, 2024

కేంద్రాన్ని తూర్పారబట్టిన ముఖ్యమంత్రి సిద్దరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం పన్నుల పంపిణీలో న్యాయం జరగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. పాలిచ్చే ఆవు నుంచి ఎవరూ పూర్తిగా పాలు పిండేయకూడదు, ఒకవేళ అలా చేస్తే దూడ పోషకాహార లోపంతో బాధపడగలదన్నారు. శ్రీకంఠీరవ స్టేడియంలో 69వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సిద్దరామయ్య  మాట్లాడుతూ కర్ణాటకకు అన్యాయం జరుగుతోందన్నారు.

కర్నాటక కేంద్రానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుస్తోందని, మహారాష్ట్ర తర్వాత కేంద్ర పన్నుల వసూళ్లలో రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఆయన వివరించారు. నాలుగు లక్షల కోట్లకు పైగా ఇస్తున్నా కేవలం రూ.55 వేల కోట్ల నుంచి రూ. 60 వేల కోట్లు మాత్రమే వస్తున్నాయని, ఈ విషయాన్ని కన్నడిగులు తెలుసుకోవాలని, మన సహకారంలో 14 నుంచి 15 శాతం మాత్రమే అందుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News