Friday, November 22, 2024

సిద్దూకే సిఎం ఛాన్స్…. మరి కాసేపట్లో ప్రకటన

- Advertisement -
- Advertisement -

 

న్యూఢిల్లీ: కర్నాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరును కాంగ్రెస్ అధిష్టానం మరికాసేట్లో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సిద్దరామయ్య, డికె శివకుమార్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ తుది విడత చర్చలు జరుపుతున్నారు. చర్చలలో భాగంగా లింగాయత్, దళిత్, ముస్లిం వర్గాల నుంచి ముగ్గురు డిప్యుటీ ముఖ్యమంత్రులను నియమిచే ప్రతిపాదనపై చర్చలు జోరుగా సాగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అదే జరిగిన పక్షంలో ఎంబి పాటిల్, జి పరేమశ్వర, యుటి ఖాదర్‌కు ఆ పదవులు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: నంద్యాల ఘటనపై చంద్రబాబు సీరియస్

సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రకటించిన పక్షంలో పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్ కేబినెట్‌లో చేరే అవకాశం లేదని వర్గాలు తెలిపాయి. ఆయన కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగానే కొనసాగవచ్చని తెలుస్తోంది. సిద్దరామయ్య, శివకుమార్‌తో పంప్రదింపులు పూర్తయిన తర్వాతే ఖర్గే, రాహుల్, పార్టీ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ కొత్త ముఖ్యమంత్రి పేరును ప్రకటిస్తారని వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News