Monday, December 30, 2024

కర్ణాటక సిఎం సిద్దరామయ్య భార్యకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి సిద్ధరామయ్య స్వల్ప న్యుమోనియాతో అస్వస్థతకు గురై పైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్‌లో తమ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరారని మణిపాల్ ఆస్పత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. 75 ఏళ్ల పార్వతి జ్వరం, శ్వాసకోశ ఇబ్బంది తో చికిత్స పొందుతున్నారని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆస్పత్రిలో భార్యను కలుసుకుని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో మాట్లాడారు. ఆమె కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని పల్మనాలజిస్ట్ డాక్టర్ గురుప్రసాద్ భట్ చెప్పారు. బుధవారం ఉదయం 9.55 కు ఢిల్లీకి వెళ్ల వలసి ఉండగా తన భార్య ఆరోగ్య పరిస్థితి కారణంగా గంట ఆలస్యంగా ముఖ్యమంత్రి ఢిల్లీకి విమానంలో బయలుదేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News