బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవికోసం మాజీ సిఎం సిద్ధరామయ్య, కెపిసిసి చీఫ్ డికె శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా పదవిని ఎఐసిసి చీఫ్ ఎం మల్లికార్జున ఖర్గేకు కేటాయించాలని ప్రతిపాదించారు. సిద్ధరామయ్యకు చెక్ చెప్పేందుకే ఖర్గేను సిఎం పదవి రేసులోకి తీసుకువచ్చారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. కెపిసిసి చీఫ్ తాజాగా ఖర్గేను ‘దళిత సిఎం’పేరిట చర్చను తెరపైకి తీసుకురావడం, స్థానికత వర్సెస్ వలస అనే చర్చను పునరుజ్జీవంపచేయడం ద్వారా సిద్ధరామయ్య అవకాశాలను దెబ్బతీయాలనేది డికె ప్రయత్నంగా కొందరు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తను సిఎం అయితే ఖర్గే ఆధ్వర్యంలో పనిచేయడం ఇష్టమని, సీనియర్ నేత ఖర్గేకు గతంలో అన్యాయం జరిగిందని పార్టీనేతలే అంటున్నారని చేసిన వ్యాఖ్యలు కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం రేపాయి.
పార్టీ నిర్ణయమే అంతిమ నిర్ణయమని డికె స్పష్టం చేశారు. ఖర్గే మా సీనియర్ నేత, ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే సిఎం పదవిని అడగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నదే ఆయన కోరిక అని డికె పేర్కొన్నారు. గతంలో ఆయనకు అన్యాయం జరిగిందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారని ఖర్గే పేరును తెరపైకి తీసుకురావడంపై ఓ ప్రశ్నకు డికె బదులిచ్చారు. సోమవారం ఆయన శృంగేరిలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెస్‌కు ఖర్గే సారథ్యం వహిస్తున్నారు. ఆయన సిఎం పదవి విషయాన్ని పార్టీకే వదిలేస్తున్నాను సిద్ధరామయ్యా తదితరులు కూడా పార్టీకి కట్టుబడి ఉంటారు. పార్టీయే ముఖ్యమని డికె తెలిపారు. కాగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవిని అధిష్ఠించాలని శివకుమార్, సిద్ధరామయ్య ఆశిస్తున్నారు. దీనిలో భాగంగా ఒకరు రాజకీయ ఎత్తుగడలతో తలమునకలయ్యారు.
ఖర్గే సిఎం పదవిని అధిష్ఠించాలనుకుంటే రేసు నుంచి తప్పుకుంటానని శివకుమార్ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఖర్గే మా నాయకుడు, ఎఐసిసి అధ్యక్షుడు నాయకత్వంలో పనిచేయడం తనకు ఇష్టమని తెలిపారు. ఖర్గే రాష్ట్రానికి, దేశానికి ఆస్తిగా డికె పేరొన్నారు. తను పార్టీ నిర్ణయానికి శివకుమార్ పునరుద్ఘాటించారు. ఖర్గే తనకంటే 20ఏళ్ల సీనియర్, కాంగ్రెస్ చీఫ్ మేము ఆయన నాయకత్వానికి మద్దతు ఇవ్వకపోతే అనైతికం అన్నారు. పార్టీ అధికారంలోకి రావడమే ముఖ్యమని తాము కాదన్నారు. శివకుమార్ ప్రకటనపై సిద్ధరామయ్య స్పందిస్తూ హైకమాండ్ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారన్నారు.